Poco X Series 2025: మార్కెట్‌లో సంచలనం సృష్టించబోతున్న కొత్త POCO సిరీస్.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరుగుద్ది!
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోని బేస్ వేరియంట్ MediaTek Dimensity 7300 Ultra చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక హైఎండ్ మోడల్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో బ్యాటరీలు వేరువేరుగా ఉన్నాయి.
ఈ POCO X7, POCO X7 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇందులోని బేస్ వేరియంట్ 5,110mAh బ్యాటరీని కలిగి ఉంటే.. ప్రో వేరియంట్ మాత్రం 6,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 90W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది.
ఇక ఇటీవలే లీక్ అయిన వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధర రూ.21,000 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ డిస్ల్పే 6.67-అంగుళాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 120Hz AMOLED డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. ఇక వీటి కెమెరాల వివరాల్లోకి వెళితే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్‌లో Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని బ్యాక్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 లెన్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.