Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత

Wed, 13 Jan 2021-11:52 am,

Pongal 2021 Date, Time And Significance: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు ఉన్న పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక మకర సంక్రాంతి(Pongal 2021) పండుగ జరుపుకుంటాము.

సంక్రాంతి పండుగను మొత్తం నాలుగు రోజులపాటు జరుపుకుంటారు. అందులో తొలి రోజున భోగి పండుగ. జనవరి 13న భోగిని జరుపుకుంటారు. భోగి మంటలు వేసి, భోగభాగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తారు.

Also Read: Pongal 2021 సంక్రాంతి ఆ రాష్ట్రాల్లోనూ ప్రత్యేకమే.. అక్కడా సెలబ్రేషన్స్

రెండో రోజు అతి ముఖ్యమైనది. రెండోరోజు మకర సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఇదే రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 14న సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఉదయం 8:29 గంటల సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. పొంగలి, పిండి వంటలు చేస్తారు. పితృ దేవతలు, దేవుళ్లకు పూజలు చేస్తారు.

మూడో రోజున కనుమ వస్తుంది. జనవరి 15, శుక్రవారం రోజు  మకర సంక్రాంతి పండుగ మూడోరోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. మూడవ రోజు గో పూజ చేస్తారు. మంచి వంటలతో విందు చేస్తారు. 

Also Read: Srisailam Brahmotsavam: ఘనంగా ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నాలుగో రోజు ముక్కనుమ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో ముక్కనుమను కూడా సెలబ్రేట్ చేస్తారు. జనవరి 16న ముక్కనుమ.

శారీరక శ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలాన్ని ఉత్తరాయణం అంటారు. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశుల వరకు ఉత్తరాయణం కొనసాగుతుంది. దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణం.  చెడు లక్షణాలు తొలగిపోయి మంచి మొదలయ్యే సమయం ఇది. అశాంతి, మానసిక వేధన లాంటి వాటికి పరిష్కారం దొరకుతుందని విశ్విసిస్తారు. దానాలు చేయడం వల్ల ఇతర కాలాల్లో చేసే దానాల కన్నా అధిక పుణ్యఫలం దక్కుతుంది.  పితృ దేవతలకు ఈ సమయంలో తర్పణాలిస్తే ఈ ఏడాది వచ్చే అన్ని సంక్రాంతులకు వారికి తర్పణం ఇచ్చినట్టేనని పెద్దలు చెబుతారు.

Also Read: Chandrababu Naidu: భోగి వేడుకల్లో చంద్రబాబు.. జీవో ప్రతుల దహనం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link