Pooja Hegde: ఫ్లాపుల పరంపరతో పతనం వైపు ప్రయాణిస్తోన్న పూజా హెగ్డే.. అందుకే వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్..

Wed, 18 Sep 2024-12:09 pm,

పూజా హెగ్డే విషయానికొస్తే.. కన్నడ భామ అయిన తమిళ చిత్రం 'మూంగముడి'తో  వెండితెరకు పరిచయం అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.

తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా మంచి నటనే కనబరిచింది.

 

హరీష్ శంకర్ డైరెక్షన్ లో  అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫేట్ మారింది.

అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'అరవింద సమేత వీరరాఘవ'సినిమాలో అరవిందగా మంచి నటనే కనబరించింది. ఆపై మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో సినిమాల సక్సెస్‌తో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ప్రభాస్‌తో చేసిన 'రాధే శ్యామ్' నుంచి ఈ అమ్మడికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బీస్ట్, ఆచార్య వంటి వరుస ఫ్లాపులతో ఈమె స్టార్‌డమ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అటు హిందీలో చేసిన 'సర్కస్’, సల్మాన్ ఖాన్‌తో చేసిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీల ఫ్లాపులతో అక్కడ స్టార్ డమ్ తగ్గింది.

  ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో సరైన సినిమాలు లేవనే చెప్పాలి. వరుస ఫ్లాపులతో  అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన  హాట్ హాట్ ఫోటోలతో రచ్చ లేపుతుంది.ప్రెజెంట్ ఈమె 'దేవా' అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ పై భారీ ఆశలే పెట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link