Pooja Hegde: వెకేషన్లోనూ అందాల ఆరబోతే.. పూజా హాట్ ట్రీట్ చూశారా!

Tue, 09 Aug 2022-11:17 am,

ముంబైలోనే పుట్టి పెరిగిన పూజా హెగ్డే తొలుత తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2012లో ఆమె చేసిన ముగమూడి అనే సినిమా ఆమెకు క్రేజ్ అయితే తీసుకురాలేదు. ఆ తర్వాత తెలుగులో ఒక లైలా కోసం, ముకుందా అనే సినిమాలు కూడా చేసింది.   

అయితే ఈ సినిమాలు కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తరువాత హిందీలో మొహంజదారో ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా మాత్రం ఆమెకు తొలి హిట్టు అందించింది. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కి ఆమె మరింత క్రేజ్ దక్కించుకుంది. 

తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం సినిమా చేసింది. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అరవింద సమేత వీర రాఘవ సినిమాతో హిట్స్ అందుకోవడం మొదలుపెట్టిన ఆమె తర్వాత మహర్షి, గద్దల కొండ గణేష్, అలవైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంది. అయితే మళ్లీ రాధేశ్యామ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆమె తర్వాత బీస్ట్ సినిమాతో కూడా దాదాపు అదే ఫలితాన్ని అందుకుంది.   

ఆచార్యకు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక ఎఫ్ సినిమాలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది, దానికి మంచి క్రేజ్ అయితే లభించింది.. ఇక ప్రస్తుతానికి రెండు బాలీవుడ్ ప్రాజెక్టులలో భాగమైన ఆమె తెలుగులో కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోంది. జనగణమన అంటూ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇక వరుస  సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న ఆమె తన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

తాజాగా ఆమె వెకేషన్ కి వెళ్ళగా అక్కడ నుంచి ఆమె షేర్ చేసిన ఫోటోలు ఆసక్తికరంగా మారాయి. అలవైకుంఠపురం సినిమాలో ఎక్కువగా తొడల మీద ఫోకస్ చేసినట్లుగా ఈ ఫోటోలో కూడా ఆమె ఎక్కువగా తొడలు అందాలు చూపించడానికి ఆసక్తి చూపిస్తోంది. కుర్రాళ్లు కూడా నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే మా కళ్లు అంటూ రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link