Prabhas - Anushka: ఫైనల్ గా ఒకటి కాబోతున్న ప్రభాస్, అనుష్క.!
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే నేషనల్ స్టార్లుగా ఎదగంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ దూసుకెళ్లుతున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకరు. 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల సలార్: సీజ్‌ఫైర్, కల్కి సినిమాలతో భారీ హిట్ సాధించి, ప్రస్తుతం 'సలార్ 2', 'రాజా సాబ్' వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇటీవల, ప్రభాస్ అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన.. సందీప్ రెడ్డి వంగాతో మరో పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్పిరిట్ అనే పేరు కూడా పెట్టారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం.
ఈ క్రమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అనే విషయంపై చాలా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అనుష్క శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించనున్నారట.
ప్రభాస్, అనుష్క కాంబినేషన్ గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే, కాబట్టి ఈ కాంబోపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా స్క్రిప్ట్‌ను సందీప్ రెడ్డి వंगा అనుష్కకు వినిపించగా, ఆమె ఈ ప్రాజెక్టులో నటించేందుకు సుముఖమయ్యారంట. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. 'స్పిరిట్' చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది మధ్యలో ప్రారంభమయ్యే అవకాశముందని తెలిసింది. మొత్తం పైన చాలా సంవత్సరాల తర్వాత మరోసారి ప్రభాస్, అనుష్క కలవడానికి ముహూర్తం త్వరలోనే ఫిక్స్ అవ్వబోతోంది.