Prabhas With KGF Director: క్రేజీ కాంబినేషన్.. మరో పాన్ ఇండియా మూవీకి భారీ ప్లాన్

Wed, 02 Dec 2020-4:50 pm,

Prabhas Next with KGF Director Prashanth Neel | కేజీఫ్ చిత్రంతో సౌతిండియాతో పాటు నార్త్ ఇండియాను టచ్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతడి దర్శకత్వంలో ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. అయితే ఆ సినిమాను మించిపోయేలా మరో సినిమా కోసం దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే భారీ అప్‌డేట్‌ను అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు.

బాహుబలి తర్వాత ఉత్తరాదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ ప్రభాస్, కేజీఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది. (Photo: Twitter)

కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ను అనౌన్స్ చేసింది. 

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ సైతం 2021లోనే పట్టాలెక్కనుంది. గతంలో సినిమాలకు చాలా టైమ్ తీసుకునే డార్లింగ్ ప్రస్తుతం వేగం పెంచుతున్నాడు. ఆదిపురుష్ పట్టాలెక్కక ముందే కొత్త ప్రాజెక్టు ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు.

నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న మరో సినిమాలో కూడా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇందులో దీపికా పదుకొనే కథానాయిక కాగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.  

ప్రస్తుతం పూజా హెగ్డే, ప్రభాస్ జోడీగా రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పటివరకూ రాధేశ్యామ్ అప్‌డేట్స్ వచ్చేవి. ఇకనుంచి సలార్ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తారు.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లేదా రెబల్ స్టార్ ప్రభాస్‌లలో ఒకరితో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడే అదే మాట నిజమైంది. భారత సినీ చరిత్రలో మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది.

ప్రస్తుతం పూజా హెగ్డే, ప్రభాస్ జోడీగా రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది.

Photos : Pooja Bhalekar Photos: RGV హీరోయిన్ పూజా భలేకర్ ఫొటోస్ ట్రెండింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించి మరింత అప్‌డేట్ అందించాడు. సలార్ ప్రపంచంలోకి నేను వెళ్లబోతున్నాను. వచ్చే ఏడాది జనవరిలో సలార్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని అభిమానులకు శుభవార్త అందించాడు ప్రభాస్.

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ (SALAAR)ను కేజీఎఫ్ తెరకెక్కించిన డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించనున్నాడు. దీంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Also Read :  Voting Numbers of Bigg Boss 4 Contestants: ఓటింగ్ నెంబర్స్ ఇవే.. మిస్డ్ కాల్స్‌తో కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link