KGF దర్శకుడితో ప్రభాస్ మూవీ.. త్వరలో అధికారికంగా వెల్లడి!

Wed, 02 Dec 2020-2:47 pm,

అది ఎవరితో అనేది మాత్రం చాలా మందికి అర్థం కాలేదు. చాలా కాలం పాటు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడేమో అని కూడా పుకార్లు పుట్టుకువచ్చాయి.మహేష్ బాబుతో కూడా చేయవచ్చు అనేది తెలిసింది. 

దాంతో పాటు డార్లింగ్ ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేయనున్నట్టు మరో వార్త వచ్చింది.   

తాజాగా ఈ వార్తనే నిజం అయ్యేలా ఉన్నాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి ఒక సినిమా చేయనున్నారట. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలని కోరుకున్న వారు కూడా దీంతో చాలా హ్యాప్పీగా ఉన్నట్టు సమాచారం.

ఈ మేరుకు కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే చిత్రం సంస్థ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఒక ప్రకటన చేసింది.

అభిమానుల అంచనాలను నిజం చేస్తూ హంబలే ఒక ట్వీట్ చేసింది. ఇందులో డిసెంబర్ 2వ తేదీన ఒక కీలక ప్రకటన చేయనున్నట్టు తెలిపింది. 

ఇటీవలే దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రభాస్‌ను కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వారిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుంది అని అభిమానులు పక్కాగా డిసైడ్ అయ్యారు.

ఈ ప్రకటన విషయానికి వస్తే అది ప్రభాస్‌తో ఆ సంస్థ చేయనున్న సినిమా అనేదే ఉంటుంది అని సినీ వర్గాల్లో అంచనా..

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో రాధేశ్యామ్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది.  

ఈ మూవీ భారీ స్థాయిలో యాక్షన్ మూవీతో పాటు ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది అని సమాచారం.

నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న మరో సినిమాలో కూడా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇందులో దీపాకా పదుకొణె కథానాయిక కాగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.  

దాంతో పాటు టీ సిరీస్‌తో ఆదిపురుష్ చిత్రం చేయడానికి అంగీకరించాడు ప్రభాస్. ఇది భారీ బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది.

ఇలా వరుసగా ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుస్తూ.. భారత దేశంలో బిగ్గెస్ట్ స్టార్‌గా మారాడు ప్రభాస్

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link