Prabhas: పాత్రలు రెండే కానీ 3 గెటప్ లు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే..!

Fri, 25 Oct 2024-4:26 pm,

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాల విపరీతంగా పెరిగిపోయాయి. 

హార్రర్ , కామెడీ,  రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఒక పాత్ర.. అదే రోజు మోషన్ పోస్టర్ లో చూపించిన మరో పాత్ర.. ఇలా రెండు పాత్రలలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో రెండు పాత్రలలో నటిస్తున్నప్పటికీ మూడు గెటప్ లు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇకపోతే మూడు గెటప్ ల లుక్ కి సంబంధించిన పోస్టర్ లు కూడా ఇటీవలే విడుదలయ్యాయి. ఏది ఏమైనా మారుతి,  ప్రభాస్ అభిమానుల కోసం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పవచ్చు. 

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. రాజాసాబ్ సినిమాతో పాటు కల్కి2,  సలార్ 2, స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాలను లైన్ లో పెట్టారు.  ఇక రాజాసాబ్ సినిమా తర్వాత ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు ప్రభాస్. భారీ అంచనాల మధ్య.. మొదటిసారి హారర్ జానర్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link