iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా..ఈ సులభమైన టిప్స్ పాటించండి
సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు ఎరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మీకు ఫోన్లు ఏవీ రావు. వైఫై మాత్రం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని పద్థతుల ద్వారా ఐఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపుండేలా చేసుకోవచ్చు.
యాప్స్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉంచడం మంచిది. కొన్ని అప్‌డేట్స్ ఫోన్ పనితీరును వేగవంతం చేస్తాయి. ఫలితంగా బ్యాటరీ అనవసరంగా ఖర్చు కాదు. ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్ ఉంచుకుంటే మంచిది.
మరో ముఖ్యమైన అంశం మీ ఫోన్ డిస్‌ప్లే. స్క్రీన్ డిస్‌ప్లే లైటింగ్ పూర్తిగా తగ్గించుకోవాలి. లేకపోతే బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. ఆటో బ్రైట్‌నెస్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా లైటింగ్ ఉండేట్టు చేస్తుంది. దాంతో బ్యాటరీ సేవ్ అవుతుంది.
బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అవకుండా ఉండాలంటే..లో పవర్ మోడ్ ఆన్ చేయాలి. ఈ ఆప్షన్‌తో బ్యాటరీ నిలబడుతుంది. ఏది అవసరమో అదే ఆన్‌లో ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ సేవ్ అవుతుంది.
గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్ లొకేషన్ సర్వీస్‌కు అవసరం. కానా జీపీఎస్ పింగ్ బ్యాటరీని త్వరగా పాడు చేస్తుంది. అందుకే సెట్టింగ్ నుంచి ప్రైవసీ..తిరిగి లొకేషన్ సర్వీసెస్ ద్వారా లొకేషన్ సర్వీసెస్‌ను పూర్తిగా నిలిపివేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆన్ చేసుకోండి.