PMBJP: ప్రధానమంత్రి జన ఔషధీ మెడికల్ షాప్స్ సరికొత్త రికార్డు.. రూ.1000 కోట్ల సేల్స్ దాటేసింది

Wed, 23 Oct 2024-1:19 pm,

Generic Medical Shops: ప్రస్తుతం కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి తగినట్లుగా ప్రజల ఆదాయం మాత్రం ఉండటం లేదు. దీంతో చిన్న అవసరాలు తీర్చుకుందుకు కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వైద్య ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. చిన్న వ్యాధులకు సైతం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది.   

ముఖ్యంగా పేద ప్రజలకు వైద్య ఖర్చులు భారీగా మారాయి. ఈ సమస్యను పరిగణలోనికి తీసుకుని ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ప్రధాన మంత్రి జనరిక్ ఔషధ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.   

ఈ ఔషధ కేంద్రాల్లో తక్కువ ధరలకు క్వాలిటీ ఔషధాలను అందిస్తాయి. ఈ మధ్య ఈ జనరిక్ మెడిసిన్ కొంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది.  జన్ ఔషధి కార్యక్రమాన్ని 2008లో  ప్రారంభించగా..2015లో మోదీ ప్రభుత్వం ఈ స్కీమును ప్రధానమంత్రి జన్ ఔషధి యోజనగా మార్చేసింది. 2016లో మళ్లీ దీన్ని ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజనగా తీసుకువచ్చింది. 

జన్ ఔషధి కేంద్రాల లక్ష్యం తక్కువ ధరలకే మందులను అందించడం.  షుగర్ ట్రీట్మెంట్ కు నెలకు దాదాపు 3వేలు ఖర్చవుతుంది. అయితే ఈ మందులను జనరిక్ షాపుల్లో రూ. 10 నుంచి 15 రూపాయలకే పొందవచ్చు. అయితే మెడిసిన్ లభ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఈ స్కీం ముఖ్యం లక్ష్యం. 

అంతేకాదు ఈ కార్యక్రమం అనేక ఉపాధి అవకాశాలను కల్పించింది. వ్యవస్థాపకులు ఈ జనరిక్ మెడికల్ షాప్స్ ఓపెన్ చేసేందుకు 2లక్షల నుంచి రూ. 2.5లక్షల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు వీటిలో అమ్మే ప్రతి మెడిసిన్ పై ప్రభుత్వం 20శాతం ప్రాఫిట్ మార్జిన్ ను అందిస్తుంది.   

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అక్టోబర్ లో రూ. 1000కోట్ల అమ్మకాలను చేరుకుంది. అంతకుముందు ఏడాది కంటే రెండు నెలల ముందుగానే ఈ లక్ష్యం సాధించింది. గత ఏడాది 2023 డిసెంబర్ లో ఈ సేల్స్ అందుకుందని డ్రగ్స్, ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమధ్యే 2024 సెప్టెంబర్ లో పీఎంబీజేపీ ఒకే నెలలో రూ. 200కోట్ల విలువైన మందులు విక్రయించింది. 

గత పదేండ్లలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది. 2014లో కేవలం 80 నుంచి నేడు 14వందల వరకు చేరాయి. దేశంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 2026నాటికి కేంద్రాల సంఖ్య 25వేలకు పెరుగుతుందని అంచనా వేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link