Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్‌కు ఇలా అప్లై చేసుకోండి.. అర్హులు ఎవరంటే..?
ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్‌లను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, బీపీఎల్ కుటుంబాలకు కేంద్రం ఉచిత గ్యాస్ సిలిండర్‌లను అందించే పథకం ప్రారంభించింది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 మే 1న ప్రారంభించారు. ఈ పథకాన్ని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
ఈ పథకానికి అర్హులు ఎవరు? ఉచిత గ్యాస్ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. వారి వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. అంతేకాదు సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెంది ఉండాలి. గతంలో ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉండకూడదు. ఆ మహిళకు బ్యాంక్ ఖాతా కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి.
కావాల్సిన పత్రాలు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటే బీపీఎల్ కార్డు, వయస్సు ధృవీకరణ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, పాస్‌పోర్టు సైజ్ ఫోటో కలిగి ఉండాలి.
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు దరఖాస్తు చేసుకునే విధానం.. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ హోంపేజీలో ఉంటుంది.
దీన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఇండేన్,భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ లిస్ట్ మీ ముందు కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఏజెన్సీని ఎంపిక చేసుకోవచ్చు.
ఆ తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో మీరు ఎంపిక చేసుకున్న కంపెనీ ఫారమ్ సబ్మిట్ చేయాలి. అక్కడ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫారమ్ ప్రింట్ తీసుకుని మీ డాక్యుమెంట్లు కూడా జత చేసి ఏజెన్సీలో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తారు.