Pragya Jaiswal: పొట్టి డ్రెస్సులు ప్రగ్యా అందాలు.. బీచ్ దగ్గర చిరునవ్వు చిందిస్తూ ఫోటోలు

Mon, 12 Feb 2024-7:43 pm,

Pragya Jaiswal in Mini Dress: 2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో అవకాశం అందుకని ఆ చిత్రంతోనే సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.  

ఆ తరువాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది. అయితే అదే సంవత్సరం తెలుగు సినిమాకి కూడా సైన్ చేసింది ప్రగ్య.

2015 లో  వచ్చిన తెలుగు సినిమా మిర్చి లాంటి కుర్రాడు తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా చేసిన  కంచె సినిమాలో నటించింది.

జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇవ్వగా దర్శకుడు ఆ సినిమాలో ఆమెను తీసుకోకుండా ఫైనల్ గా కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చాడు.

కంచె సినిమా ప్రగ్యాకి అందం పరంగా అభినయం పరంగా ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కనిపించి మెప్పించిన ప్రగ్యా ఈమధ్య అఖండ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకుంది.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఆరెంజ్ డ్రస్సులో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బీచ్ ముందర నిలబడుకొని చిరునవ్వులు చిందుతూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు మనల్ని ప్రేమలో పడేయడం ఖాయం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link