Pragya Jaiwal:రెడ్ డ్రెస్ లో ‘ప్రగ్యా జైస్వాల్’ పరువాల విందు..

Tue, 01 Oct 2024-12:48 pm,

ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో 'అఖండ'వంటి  బ్లాక్ బస్టర్  ఉన్నా ఆమెకు తగ్గ అవకాశాలు ఈ భామకు రాలేదు. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్స్ నే నమ్ముకుంటోంది.

ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. కోలీవుడ్ మూవీ 'విరాట్టు'తో  మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో 'టిటూ MBA' చిత్రంతో ఇంట్రడ్యూస్  అయినా..పెద్దగా యూజ్ లేకుండా లేకపోయింది.

తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో తెలుగులో అడుగు పెట్టింది. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో  తెరకెక్కిన 'కంచె' సినిమాతో తెలుగు  ప్రేక్షకుల మదిని దోచుకుంది.

కంచె చిత్రం తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది.

ఇక  బాలకృష్ణ హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్  హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్  అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు దక్కిందనే చెప్పాలి. ఈ చిత్రంతో ప్రగ్యాకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. త్వరలో NBK 109లో ఈమెకు  మరోసారి ఛాన్స్ ఇచ్చాడు

అంతేకాదు ప్రగ్యా.. అక్షయ్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీతో పలకరించింది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదలై మంచి టాక్ వచ్చినా.. శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ మూవీ ముందు చతికిల బడింది. 

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్  కాక ముందు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link