Pranitha Subhash wedding photos: ప్రణీత సుభాష్‌ పెళ్లి ఫోటో గ్యాలరీ

Wed, 02 Jun 2021-9:50 am,

తెలుగులో అత్తారింటికి దారేది, బావ, రభస, డైనమైట్, పాండవులు పాండవులు తుమ్మెద, ఎన్టీఆర్ - కథానాయకుడు వంటి చిత్రాల్లో నటించిన ప్రణీత సుభాష్‌ని తెలుగు ఆడియెన్స్ ముద్దుగా బాపు బొమ్మ అని కూడా పిలుచుకుంటుంటారు.

తన పెళ్లిపై ప్రణీత సుభాష్ స్పందిస్తూ.. ''తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం (Love cum arranged marriage) అని, కాకపోతే కరోనావైరస్ ప్యాండెమిక్ కారణంగా పెళ్లి తేదీ, ముహూర్తం విషయంలోనే పెళ్లికి ఒక రోజు ముందు వరకు క్లారిటీ లేకపోయింది'' అని చెప్పింది.

తన పెళ్లి వివరాలను ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులకు వెల్లడించిన ప్రణీత సుభాష్. 

పెళ్లి వార్తను (Pranitha Subhash wedding) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు, స్నేహితులతో పంచుకున్న ప్రణీత సుభాష్.. తమ పెళ్లి వేడుక వివరాలను ముందే బహిర్గతం చేయనందుకు వారికి క్షమాపణలు చెప్పుకుంది. 

ఫ్యాషన్ ప్లస్ బ్యూటీ కలగలిసిన హీరోయిన్ ప్రణీత సుభాష్. 

కరోనావైరస్ వ్యాప్తి తగ్గి పరిస్థితులు అన్నీ నార్మల్ అయ్యాక అందరితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకోనున్నట్టు ప్రణీత సుభాష్ (Actress Pranitha Subhash)  తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది.

మొత్తానికి అటు కన్నడ ఆడియెన్స్, ఇటు తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్న బాపు బొమ్మ ఈ లాక్‌డౌన్‌లోనే ఒక ఇంటిదయ్యిందన్న మాట (Pranitha Subhash ties know with Nitin Raju).

వీళ్లు ప్రణీత సుభాష్ తల్లిదండ్రులు (Pranitha Subhash's parents). ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే సందర్భంగా ప్రణీత తన తల్లిదండ్రుల ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నప్పటి ఫోటో ఇది. 

ప్రణీత సుభాష్ గతేడాది లాక్ డౌన్ విధించినప్పుడు లాక్‌డౌన్ (Lockdown) కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడే నితిన్ రాజు కూడా ప్రణీతతో (Pranitha Subhash love story with Nitin Raju) కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడట. అలా వీళ్లిద్దరూ మరీ క్లోజ్ అయ్యారని శాండల్‌వుడ్ టాక్.

చీర కట్టినా, చిట్టి పొట్టి దుస్తులే వేసినా.. అందంగా కనపడటంలో ప్రణీత సుభాష్‌ ప్రత్యేకతే వేరు. ఈ చీరకట్టు, అందమైన కళ్లు, వయ్యారంగా ఒంపుసొంపులే ప్రణీత సుభాష్‌ని (Actress Pranitha Subhash marriage photos) తెలుగు వాళ్ల బాపు బొమ్మను చేశాయి. బాపు బొమ్మ అనే ముద్ర పొందడం అంటే అది అతి కొద్ది మంది హీరోయిన్లకే సొంతమైన పేరు మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link