Smallcap stock: ఈ 30 రూపాయల స్టాక్.. ఇన్వెస్టర్ల పంట పండించింది.. ఎలాగో తెలుసా?

Wed, 01 Jan 2025-10:05 pm,

 Prozone Realty Share Price:  దేశీయ స్టాక్ మార్కెట్లో 2025 జనవరి 1న మంచి లాభాలను నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 368 పాయింట్లు పెరిగి 78507.41 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచి నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకొని 23742.90 సెషన్ ముగిసింది. ఈ క్రమంలోనే ప్రముఖ రియాల్టీ స్టాక్ ప్రోజోన్ రియాల్టీ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది.  

 ఒక్క సోషన్లోనే దాదాపు 20% దూసుకెళ్లింది. ముందు సెషన్ లో అంటే 2024 డిసెంబర్ 31న 27.71 వద్ద ముగిసింది. బుధవారం మంచి లాభాలతోనే 29.85 వద్ద ఓపెనింగ్ ఆ తర్వాత కాసేపటికి 20% అప్పర్ సర్క్కూట్ తాకింది.  చివరికి 19.99% లాభంతో 33.25 వద్ద ఈ సెషన్ ముగించింది  

ఈ కంపెనీ మార్కెట్ విలువ ఈ క్రమంలోనే 507.40 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 44.80 ఉండగా 52 వారాల కనిష్ట ధర 20.91 గా ఉంది. కంపెనీ ఇప్పుడు చేసిన ఒక్క ప్రకటనతోనే భారీగా దూసుకెళ్లిపోయింది. దాదాపు 3.96 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ ఆఫర్లను కొనుగోలు చేసేందుకు ప్రకటించింది.

 కంపెనీ మొత్తం ఈక్విటీలో ఇది 26% వాటాకు సమానం అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక్కో షేర్ ధర 25 రూపాయలుగా ప్రకటించింది. ఇక ఇందులో భాగంగా మొత్తం 99.19 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. 52 వారాల గరిష్ట ధర అయినా 44.90కి 26% దూరంలోనే ఉంది.  

2024 ఫిబ్రవరిలో ఇలా ఆల్ టైం తాకిందని చెప్పవచ్చు. ఇక గత ఐదు రోజుల్లో ఈ షేర్ 32 శాతం పుంజుకుంది నెల రోజుల్లో 37% శాతం పుంజుకుంది. ఆరు నెలల్లో చూస్తే  ఏడాదిలో చూస్తే ఒక శాతానికి పైగా పెరిగింది.

2024 25 ఆర్థిక సంవత్సరం  సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ 11.33 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇక ఇదే అంతకుముందు ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంలో 1.39 కోట్ల లాభం ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link