Pushpa 2 Day 1 Collections: ఫుష్ప 2 డే 1 కలెక్షన్స్ .. బాక్సాఫీస్ పై అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ జాతర..

Thu, 05 Dec 2024-2:53 pm,

పుష్ప 2 ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ చేసిన హంగామాకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. అది బుకింగ్స్ రూపంలో కనిపించింది. అంతేకాదు ఈ సినిమా థియేట్రికల్ గా తెలుగులోనే కాదు మన దేశంలోనే ఏ సినిమా చేయనట్టు రికార్డు బ్రేక్ రూ. 600 కోట్లకు పైగా  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే.. దాదాపు రూ. 220 కోట్ల షేర్ (రూ. 400 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాలి. హిందీలో కూడా దాదాపు రూ. 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా అక్కడ రూ. 300 కోట్ల వరకు నెట్ షేర్ వసూళ్లు సాధిస్తే హిట్ కింద లెక్క.

మరోవైపు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ 4 రోజుల పాటు దాదాపు రూ. 200 పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రీమియర్స్ కు దాదాపు రూ. 800 అదనపు రేటు పెంచినా.. ప్రేక్షకులు కూడా అభిమాన హీరో నట విశ్వరూపం చూడడానికి ఎక్కడా తగ్గేదే అంటూ థియేటర్స్ కు క్యూ కట్టారు.

మొత్తంగా నాన్ హాలీడే రోజున బిగ్గెస్ట్ రిలీజ్ డేట్ సొంతం చేసుకున్న పుష్ప 2 ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ. 14 నుంచి రూ. 15 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా స్పెషల్ ప్రీమియర్స్ పరంగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఓవరాల్ గా బుక్ మై షో లెక్కల ప్రకారం విడుదల ముందు రోజు వరకు రూ. 150 కోట్ల గ్రాస్ లెక్కను దాటేసింది పుష్ప 2. మరోవైపు తెలంగాణలో ఈ సినిమాకు మంచి ఊపు నిచ్చే కలెక్షన్స్ ఇచ్చాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఫస్ట్ డే కలుపుకుంటే.. దాదాపు రూ. 60 కోట్ల షేర్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈవెనింగ్, నైట్ షోలు ఆఫ్ లైన్ సేల్స్ బట్టి ఇవి ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మొత్తంగా రూ. 65 కోట్ల నుంచి రూ. 70 కోట్ల రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు సాధించవచ్చు.

ఇక హిందీలో పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. అక్కడ పుష్ప 2 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రానున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడులో పుష్ప రాజ్ పర్వాలేదనిపిస్తున్నాడు. కర్ణాటకలో కూడా పుష్ప 2 మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా కుమ్మేసిందనే చెప్పాలి.

మొత్తంగా పుష్ప 2 తొలి రోజు దాదాపు రూ. 130 కోట్ల షేర్ (రూ. 250 కోట్ల గ్రాస్) వసూళ్లకు కాస్త అటు ఇటుగా  సాధించే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link