Sreeleela: నడుమందాలతో కిస్సిక్ పాప కసక్ ఫోజులు.. శ్రీలీల లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్..

Wed, 18 Dec 2024-3:40 pm,

 శ్రీలీల తెలుగులో  బుల్లెట్ వేగంతో వచ్చి రాకెట్ వేగంతో కథానాయికగా దూసుకుపోతుంది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తెగ అలరిస్తోంది.

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2లో కిస్సీక్ సాంగ్ తో మరోసారి హల్ చల్ చేస్తోంది.  పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తో చేసిన శ్రీలీల డాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

అంతేకాదు ఈ సినిమాలో ఐటెం పాటతో ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. మొత్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది శ్రీలీల. తెలుగులో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకులను మెప్పించింది.

శ్రీలీల.. హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ తెలుగు సినిమాతో  ఓవర్ నైట్ పాపులర్ అయింది. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో వరుస ఛాన్సులతో  క్రేజీ భామగా  మారింది.

తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటిస్తోంది శ్రీలీల. ప్రస్తుతం సినిమాలతో పాటు MBBS చేస్తోంది. వచ్చే యేడాది ఈమె డాక్టర్  చదువు కంప్లీటయ్యే అవకాశాలున్నాయి.స్వతహాగా తెలుగు భామ అయిన ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. అక్కడ కన్నడలో వచ్చిన 'కిస్' చిత్రంతో కథానాయికగా   పరిచయమైంది.

శ్రీలీల ఈ యేడాది ‘గుంటూరు కారం’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది. వరుస ఫ్లాపుల్లో ఈ భామకు ‘పుష్ప 2’ లో చేసిన కిస్సిక్ స్పెషల్ సాంగ్ ప్యాన్ ఇండియా లెవల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.  బాలీవుడ్ హీరోలు... దర్శక, నిర్మాతలు శ్రీలీలతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం శ్రీలీల.. పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పాటు.. రవితేజతో చేస్తోన్న చిత్రంపై  శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది. శ్రీలీల నటిగానే కాకుండా.. తన పర్సనల్  విషయాలతో వార్తల్లో  నిలిచింది. ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో చిత్రంతో శ్రీలీలకు స్టార్ డమ్ వచ్చింది.

లాస్ట్ ఇయర్..  శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి'చిత్రం మాత్రమే బ్లాక్ బస్టర్ గా  నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link