PV Sindhu: పీవీ సింధు రిసెప్షన్ ఫొటోలు.. హైదరాబాద్‌కు అతిరథ మహారథులు..
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వేంకట సింధు, ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ రిసిప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఇక సింధు తన స్నేహితుడు అయిన పోసిడెక్స్ ఈడీ వేంకట దత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్లి డిసెంబర్ 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. అంతకు ముందు రోజు మెహందీ, హల్దీ వేడుకలు కూడా జరిగాయి.
రిసెప్షన్‌లో ఫల్ఘుని షేన్ పీకాక్ ధరించారు. ఐవరీ లెహంగాలో అద్భుతంగా కనిపించింది సింధు. దీనికి తగ్గట్లు డైమండ్ జువెలరీ కూడా ఆమె ధరించింది.
పీవీ సింధు వెడ్డింగ్ రిసిప్షన్ కోసం హైదరాబాద్‌కు అతిరథ మహారథులు క్యూ కట్టారు. మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే భార్యతోపాటు వచ్చారు.
ముఖ్యంగా హీరో అజిత్ భార్య షాలినీ పిల్లలు ఆద్విక్, అనౌష్కలు స్పెషల్ అట్రాక్షన్
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు, నాగార్జున, దీపిక రణవీర్, ఉపాసన, రోజా, మంగ్లీ, అలీ కుటుంబం, చాముండేశ్వరీ నాథ్ కూడా ఈ వేడుకలో కనిపించారు.
పీవీ సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2019 గోల్డ్ మెడలిస్ట్. ఈమెకు 5 ప్రపంచ ఛాంపియన్ మెడల్స్ కూడా ఉన్నాయి.
రియో ఒలింపిక్ 2016లో సిల్వర్ మెడల్ దక్కించుకుంది. 2020 టోక్యో గేమ్స్‌లో కాంస్యం గెలుచుకుంది.