PV Sindhu: పీవీ సింధు అక్క కూడా క్రీడాకారిణి అని మీకు తెలుసా? ఫొటోస్ వైరల్..
పీవీ సింధు ఈమె రెండు సార్లు ఒలంపిక్ మెడల్ విన్నర్. ఐటి ప్రొఫెషనల్ అయిన వెంకట దత్త సాయితో ఈ నెల 22వ తేదీన ఏడడుగులు వేయనుంది అని పీవీ సింధు తండ్రి రమణ చెప్పారు. పెళ్లి ఉదయ్‌పూర్‌లో జరగనుంది.
హైదరాబాద్ వేదికగా 24వ తేదీన రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. అయితే చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే పీవీ సింధు అక్క పీవీ దివ్య కూడా క్రీడాకారిణి. అయితే పీవీ దివ్య హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఈమె పీవీ సింధు కంటే ఏడేళ్లు పెద్ద.
ఈమె నేషనల్ లెవెల్ ప్లేయర్ అయితే మధ్యలోనే క్రీడలను ఆపేసి ఆమె డాక్టర్ చదివారు. ఆమె స్కూల్ నుంచే మంచి టాపర్ అందుకే తను వైద్యవిద్యను అభ్యసించారని పీవీ సింధు ఓ ఇంటర్నేషనల్ మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.
పివి దివ్య 2012లో శ్రీరామ్ గొల్ల అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి కూడా పీవీ సింధు హాజరు కాలేక పోయింది. అదే రోజు సయ్యద్ మేదీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ఫిక్స్ టోర్నీ ఉండటంతో పివి సింధు పెళ్ళికి హాజరు కాలేకపోయింది.
అయితే ఈ టోర్నీని విన్ అయి తన అక్కకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పిన పీవీ సింధు, దురదృష్టవశాత్తు ఇండోనేషియాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఓడిపోయింది.
అక్క బావకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పీవీ సింధు షేర్ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు తన అక్కతో తనకున్న అనుబంధాన్ని చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పీవీ సింధు షేర్ చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటుంది.