Raashi Khanna Photos: అందాలతో హొయలు పోతున్న బొద్దుగుమ్మ రాశీఖన్నా
రాశీ ఖన్నా.. 1990 నవంబరు 30న ఢిల్లీలో జన్మించింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటిగా మంచి గుర్తింపు సంపాదించింది రాశీ.
2013లో హిందీ చిత్రం 'మద్రాస్ కేఫ్'తో అరంగేట్రం చేసింది రాశీఖన్నా. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో (2014) తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
'బెంగాల్ టైగర్', 'సుప్రీమ్', 'జై లవకుశ', 'తొలి ప్రేమ' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. రాశీ ఖన్నా.. నటనతో పాటు గాత్రంతోనూ అలరిస్తోంది. 'జోరు', 'జవాన్', 'ప్రతిరోజూ పండగే' చిత్రాల్లో పాటలు కూడా పాడింది.
తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళంలోనూ సినిమాలు చేస్తోంది. 'తుగ్లక్ దర్బార్', 'మేథావి', 'భ్రమమ్', 'సైతాన్ కా బచ్చా' అనే చిత్రాల్లోనూ నటిస్తోంది.
ప్రస్తుతం 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ', 'సర్దార్' చిత్రాల్లో నటిస్తోంది.