Rahu Effects: వేగం పెంచేసిన రాహువు.. ఈ రాశులవారు కోట్లు కొల్లగొట్టబోతున్నారు.. రెడీగా ఉండండి!

Mon, 25 Nov 2024-8:37 am,

వృషభ రాశి వారికి రాహు గ్రహం వేగంగా కదలికలు చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వీరికి రాహువు అనుగ్రహం లభించి సిరిసంపదలు పొందే అవకాశాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా వస్తున్న అనేక ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న ఆదాయం కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆర్థిక లావాదేవీలు చేసే వారికి గతంలో కంటే ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.  

 అలాగే వృషభ రాశి వారు విదేశీ సొమ్మును కూడా అనుభవించే అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. ఇక వ్యాపారాలు చేస్తున్న వృషభ రాశి వారికి విదేశీ ఒప్పందాలు కలుగుతాయి దీంతో వీరు భారీ మొత్తంలో సంపాదిస్తారు. ఈ సమయంలో కొందరు ప్రముఖులతో పాటు పరిచయాలు కూడా ఏర్పడతాయి.  

మిధున రాశి వారికి కూడా రాహు వేగంగా కదలికలు జరపడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి రాహు అనుగ్రహం లభించి.. ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో కీలక పదవులు లభిస్తాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు భారీ మొత్తంలో అభివృద్ధి చెందుతారు. అలాగే ఈ సమయంలో వీరు గృహాలతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశాన్ని పొందగలుగుతున్నారు.

 ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. గతంలో నుంచి ఉద్యోగాలు మారాలనుకుంటున్న వారికి ఇది అద్భుతమైన సమయం గా భావించవచ్చు. ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ పొందడమే కాకుండా ప్యాకేజీ ఎక్కువగా ఉండే జాబుల్లో జాయిన్ అవుతారు.  

మకర రాశి వారికి కూడా రాహు వేగం పెంచడం కారణంగా ముట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలగడమే కాకుండా పలుచోట్ల నుంచి వివిధ రకాల ఆదాయాలు రావడం ప్రారంభమవుతాయి. ఆస్తి వివాదాలు కూడా కూడా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

 ఇక వ్యాపారాలు చేస్తున్నవారు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీనివల్ల వీరు అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. ఏ రంగంలో పనులు చేసే వారికైనా ఈ సమయంలో రాహువు అనుగ్రహం లభించి పురోగతి తప్పకుండా లభిస్తుంది. అలాగే అనేక వివాదాన్ని కూడా తొలగిపోతాయి..  

కుంభ రాశి వారికి కూడా రాహు వేగంగా కదలికలు జరపడం వల్ల విశేష లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయంలో అంచనాలు అనుకున్న దానికంటే విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వీరి మాటలకు విలువ పెరగడమే కాకుండా అనేక సమస్యల నుంచి ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది.

 అలాగే కుంభ రాశి వారికి రాజ్య పూజ్యము ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా కూడా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. వృత్తి వ్యాపార పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ఇక కుటుంబ పరిస్థితుల విషయానికొస్తే ఈ సమయంలో కుంభ రాశి వారు అనుకున్నది సాధించగలుగుతారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link