Raksha bandhan 2024: భద్ర ఎవరు.. రాఖీ పండగ రోజే భద్ర నీడ ఎందుకు..?.. దీని వెనుక ఈ రహస్యం తెలుసా..?

Mon, 05 Aug 2024-1:25 pm,

శ్రావణ మాసంలోను పండుగల మాసం అనికూడా పిలుస్తుంటారు. ఈ రోజు నుంచి (ఆగస్టు 5) నుంచి శ్రావణ మాసంమొదలైంది. ఈనెలలో నాగ పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి వంటి అనేక పండుగుల వస్తుంటాయి. అదే విధంగా శ్రావణ సోమవారం, శుక్రవారం, శనివారాలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రావణంలో భక్తులు చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు  

ముఖ్యంగా శ్రావణ మాసంలో రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సారి రాఖీ పండగ ఆగస్టు నెల 19 వ తేదీన వస్తుంది. ఈ నేపథ్యంలో.. రాఖీ అనేది పురాణాల కాలం నుంచి వస్తుంది. ఒక సోదర, సోదరీ మణుల ప్రేమ, వారి పట్ల మనకుంటే బాధ్యతలను ఇది చెప్తుంది. ఈ రోజున తమ తోడబుట్టిన అక్క, తమ్ముళ్లు, అన్నలు,చెల్లెల్లు ఎక్కడున్న ఒక్కచోటకు వచ్చేసి రాఖీ పండుగను వేడుకగా జరుపుకుంటారు.  

రాఖీ కట్టడం వల్ల తమ సోదరడికి అది ఒక బంధంలాగా కాపాడుతుందని చెప్తుంటారు. అదే విధంగా మహాభార కాలంలో ద్రౌపదీ కూడా ..  శ్రీకుష్ణుడికి రాఖీ కడుతుంది. ఆ తర్వాత ద్రౌపదీ ఆపదలో ఉన్నప్పుడు.. శ్రీకృష్ణుడు కాపాడి తనబాధ్యతను నెరవేర్చుకుంటాడు.

అందుకే రాఖీ పౌర్ణమిని ఎంతో పవిత్రంగా కూడా జరుపుకుంటారు. ఈరోజు రాఖీలు కట్టిన అక్కా, చెల్లెళ్లకు తమ సోదరులు బహుమతులు ఇచ్చి, వారిని సంతోషింప చేస్తుంటారు. తమ వాళ్లు బాగుండాలని కోరుకుంటారు. అయితే..రాఖీ పండుగ వచ్చిందంటే భద్ర అనే విషయం తరచుగా చర్చల్లో వస్తుంటుంది. భద్ర కాలంలో.. రాఖీ కట్టుకొవద్దని పండితులు చెబుతుంటారు.   

పురాణాల ప్రకారం.. భద్ర.. సూర్యుడు, ఛాయాదేవీల కూతురు. శనీశ్వరుడికి సోదరి. ఈమె పుట్టినప్పటి నుంచి ఎంతో కఠినంగా ఉండేదంట. ఆమె శివుడి గురించి తపస్సు చేసి వరాలను పొందింది. వరం గర్వం వల్ల హోమాలు చేసేవారిని వేధించేదంట.

ప్రజలను హింసించేందంట. దీంతో సూర్యుడి బ్రహ్మకు వెళ్లి తన బాధను చెప్పి.. శాశ్వతంగా ఆకాశంలో ఉండేలా కోరుకున్నాడంట.. కానీ ఆమె మాత్రం చాలా అరుదుగా అప్పుడప్పుడు మాత్రం భూమిమీదకు వస్తుందంట. అందుకే ఈ కాలాన్ని భద్ర కాలం లేదా భద్ర నీడ అని పిలుస్తుంటారు.

రాఖీపౌర్ణమి వేళల్లో భూమిపైకి వస్తుందని కూడా బ్రహ్మ చెప్పాడంట. అందుకే రాఖీ పౌర్ణమిరాగానే ప్రతిసారి భద్ర కాలం గురంచి చర్చ జరుగుతుంది. ఈ కాలంలో రాఖీ కట్టుకొవడం చేయకూడదు. దీని వల్ల చెడు ఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు. అందువల్ల ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు. 

ఈ సారి ఆగస్టు 19 న రాఖీ పండు రోజు.. భద్ర కాలం అనేది.. మధ్యాహ్నం 11.30 నుంచి 2.00 మధ్యాహ్నం వరకు ఉందని, ఆ తర్వాత సాయంత్రం.. 5 గంటల నుంచి రాత్రి 7 వరకు ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కాకుండా.. మిగత శుభసమయంలో రాఖీ కట్టుకొవచ్చని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link