Rakul Preet Singh: కారిదార్ లో రకుల్ ఫోటోలు.. ఎలా తీయాలో కూడా తెలీదా అంటూ కామెంట్స్..

Wed, 17 Jan 2024-7:59 pm,

Rakul Preet: సందీప్ కిషన్ హీరోగా చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ప్రార్థన క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్.

ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో సైతం ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కి వెళ్ళిపోయింది. తెలుగులో రాణిస్తున్న రోజుల్లోనే హిందీలో అవకాశాలు రావడంతో అక్కడికి మక్కాం మార్చింది.

అప్పటి నుంచే ఈ హీరోయిన్ కి కష్టకాలం మొదలైంది. హిందీలో పెద్దగా ఆఫర్లు రాక.. తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి.

రకుల్ ప్రీత్‌కు ప్రస్తుతం తెలుగులో అంతగా ఆఫర్లు అయితే రావడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పూర్తిగా రకుల్ ఫేడ్ అవుట్ అయింది. 

టాలీవుడ్ ..బాలీవుడ్ పరిస్థితి పక్కన పెడితే కోలీవుడ్‌లో కూడా అనుకున్న స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. 

కానీ ప్రస్తుతం తన సోషల్ మీడియా ఫోటోల ద్వారా మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది ఈ హీరోయిన్. లేటెస్ట్ గా కారిదార్ లో నిలబడుకొని పూల రంగు సూట్ లో రకుల్ తీసుకున్న ఫోటోలు అందరినీ ఫిదా చేస్తున్నాయి.

అయితే ఈ ఫోటోల కింద రకుల్.. కారిదార్ లో ‘మనకు ఫోటోలు తీసుకోవడం రానప్పుడే ఇలా జరుగుతుంది’ అంటూ కామెంట్ పెట్టింది. రకుల్ అభిమానులు మాత్రం.. తీయడం రాకపోయినా ఫోటోలో రకుల్ చాలా అందంగా ఉంది అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link