Rakul Preet Singh: డిఫరెంట్ లుక్స్ తో రకుల్.. ఆశ్చర్యపోతున్న ఫాన్స్..!
‘ప్రార్థన…ప్రతి రూపాయి కౌంట్.. ఇక్కడ’ అనే డైలాగ్ తో తెగ ఫేమస్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ హీరోగా చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్.. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది.
ఇక ఆ తర్వాత నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. కానీ అనుకున్న రేంజ్ లో ఆ తరువాత.. రకుల్ కి మంచి విజయాలు రాలేకపోయాయి. దాంతో తన అదృష్టాన్ని హిందీ సినిమాల్లో ప్రయత్నించింది రకుల్.
అక్కడ మొదటి సినిమానే అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో చేసింది. అయినా కానీ పెద్దగా లాభం లేకుండా పోయింది. తెలుగులో జరిగినట్టే హిందీలో కూడా.. మొదటి సినిమాతోనే పేరు వచ్చిన.. ఆ తరువాత విజయాలు మాత్రం రాలేదు.
కానీ హిందీలో అదృష్టం కొద్ది..అవకాశాలు మాత్రం బాగానే వచ్చాయి. ఇక హిందీలో సెటిల్ అయినా ఈ భామ.. అక్కడే ఒక నిర్మాతను పెళ్లి చేసుకొని.. పర్సనల్ లైఫ్ పరంగా కూడా సెటిల్ అయిపోయింది.
తెలుగు సినిమాలకు దూరమై మాత్రం చాలా రోజులు కావస్తోంది. మరి తొందరలో ఈ హీరోయిన్ ఏదన్నా తెలుగు సినిమా చేసందేహం లేదా.. అనేది చాలామందికి ఉన్న సందేహం. ఇక ఈ మధ్యనే ఇండియన్ 2 చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తెగ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ.. తన అభిమానులను తన అందంతో ఆకట్టుకోవడమే కాకుండా.. రకుల్ ఫేస్ లో ఎందుకు చాలా చేంజ్ వచ్చింది అని ఆశ్చర్యపరుస్తోంది కూడా.