Rakul Preet Singh: కరోనా బారిన పడ్డ రకుల్ ప్రీత్ సింగ్‌‌.. ట్వీట్

Tue, 22 Dec 2020-5:01 pm,

Rakul Preet Singh Tests Positive For CoronaVirus | కరోనా వైరస్ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, దేశాధినేతలతో పాటు మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించింది. నేటికీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అయితే ప్రభావం కాస్త తగ్గడం ఊరట కలిగించే అంశం. ఈ క్రమంలో తాజాగా మరో టాలీవుడ్ సెలబ్రిటీ కరోనా వైరస్ బారిన పడ్డారు. (Photo: Twitter/@Rakulpreet) 

Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కరోనా బారిన పడింది. తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పూర్తి వివరాలు తెలిపింది.

తనకు కరోనా వైరస్ (CoronaVirus) లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ చేయించుకోగా, కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చినట్లు ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపింది. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేకోవాలని సూచించింది. ఇటీవల నటి, హోస్ట్ మంచు లక్ష్మి హీరోయిన్ రకుల్‌ను కలిసినట్లు తెలిసిందే.

త్వరలోనే కరోనాను జయించి మూవీ షూటింగ్‌, ఇతరత్రా కార్యక్రమాలలో పాల్గొంటానని రకుల్ ప్రీత్ ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల ఈమెను కలిసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. (Photo: Rakul Preet Singh Twitter)

Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link