Ram Charan at Oscars: పుట్టబోయే బిడ్డ అదృష్టంతో ఆస్కార్.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆస్కార్ అవార్డుల వేడుకకు రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన కొణిదలతో కలిసి హాజరయ్యారు.
రెడ్ కార్పెట్ మీద తన బ్లాక్ డ్రెస్ తో అలరించిన రామ్ చరణ్ తేజ తర్వాత భార్య ఉపాసనతో కలిసి అక్కడి రెడ్ కార్పెట్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉపాసన తాను తన భర్తకు సపోర్టుగా ఇక్కడికి వచ్చానని ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అనే విషయం మీద కొంత టెన్షన్ ఉన్నా ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉందని కామెంట్లు చేసింది.
అయితే రామ్ చరణ్ తేజ తన భార్య ఉపాసన గురించి మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఆరు నెలల గర్భవతిగా ఉందని తనకు పుట్టబోయే బిడ్డ తనకు అదృష్టం తీసుకొస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఆసక్తికరంగా రామ్ చరణ్ మాట్లాడిన విధంగానే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ యూనిట్ని వరించడంతో రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ అదృష్టమే ఆస్కార్ అవార్డుని తీసుకువచ్చింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏమిటో కూడా కింద కామెంట్ చేయండి.