Allu Arjun: అల్లు అర్జున్ ఘటనపై రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్..!

Thu, 02 Jan 2025-3:52 pm,

గడిచిన కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అభిమానులు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపైన అటు మెగా కుటుంబ సభ్యులు కానీ.. ఇటు అల్లు కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు.

ఇటీవలే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి, నాగబాబు, సురేఖ.. అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి మరీ పరామర్శించడం జరిగింది. కానీ అక్కడ కూడా ఈ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వారికి శుభం కార్డు పడలేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు అనేది ఎంతో మంది వాదన. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ విషయం పైన మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఎన్నో సందర్భాలలో ఇరు కుటుంబంలో కొంతమంది మాత్రం.. నిరూపణ చేసుకోవాలి అనుకున్నప్పటికీ.. ఎన్నోసార్లు విభేదాల వార్తలు.. ఊపందుకుంటూనే ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ కు సపోర్టు చేయకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

కాగా ఇటీవల మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనలో..  అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరైనది కాదు అంటూ.. సపోర్టుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి మాటలు రావడంతో..  బన్నీ అభిమానులలో కూడా కాస్త మార్పు కనిపించింది.

ఈ క్రమంలో రామ్ చరణ్ మాత్రం అల్లు అర్జున్ విషయంపై స్పందించకపోవడం సోషల్ మీడియాలో కొన్ని చర్చలకు దారితీసింది. అయితే రామ్ చరణ్ కూడా అన్ స్టాపబుల్ 4 లో  ఈ విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బాలకృష్ణ ప్రోగ్రామ్ కి  గెస్ట్ గా రావడం జరిగింది.. ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ తో  ఉన్న తన బంధాన్ని కూడా తెలుపుకొచ్చారంట. నిన్నటి రోజున ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇందులో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం పైన కూడా రామ్ చరణ్ ఎమోషనల్ గా స్పందించినట్లు.. ఈ ఎపిసోడ్ కి వెళ్లిన కొంతమంది ఆడియన్స్ వెల్లడించారు.

రామ్ చరణ్ చెప్పిన విషయాలు  అటు రామ్ చరణ్ అభిమానులను, ఇటు అల్లు అభిమానులను కూడా శాంతింప చేసేలా ఉన్నాయని సమాచారం. గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి కూడా రామ్ చరణ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారట. మొత్తానికి అల్లు వ్యవహారం పైన రామ్ చరణ్ ఎలాంటి వాక్యాలు చేశారో అని అభిమానులు కూడా ఆహా లో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ గేమ్ ఛేంజర్ చిత్రానికి కూడా ప్లస్ కాబోతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link