Game Changer Pre Release Business: ‘గేమ్ ఛేంజర్’ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్.. గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఆనలే..

Wed, 08 Jan 2025-5:35 am,

Game Changer Pre Release Business: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమాకు ప్రమోషన్ ను ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. అటు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసారు.

అటు ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్యాన్ ఇండియా మూవీ అన్నా..  మొత్తంగా ప్రమోషన్స్ ను తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయ్యారు.

హిందీ, తమిళంలో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. తమిళంలో ఈ సినిమాకు అక్కడ పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడం కలిసొచ్చిన అంశం. పైగా శంకర్ ఫ్యాక్టర్ అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయి. హిందీలో లక్నో తర్వాత ముంబైలో సోసోగా ప్రమోషన్స్ నిర్వహించారు. మొత్తంగా అక్కడ రూ. 20 కోట్ల లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ‘గేమ్ చేంజర్’ మూవీని మూడు భాషల్లోనే విడుదల చేస్తున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి.కానీ శంకర్ ట్రాక్ రికార్డు గత కొన్నేళ్లలో అంతగా బాగాలేదు. మొత్తంగా ఈ సినిమాను రామ్ చరణ్ తన భుజాలపైనే మోస్తున్నాడు. గేమ్ చేంజర్ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 43.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాయలసీమ (సీడెడ్)లో  రూ. 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ క్లోజ్ అయింది.

రామ్ చరణ్ గత సోలో మూవీ ‘వినయ విధేయ రామ’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 77.94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెలుగు స్టేట్స్ లో రూ. 191 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ మూవీ రూ. 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

తాజాగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)..రూ. 43.50 కోట్లు.. రాయలసీమ(సీడెడ్).. రూ. 23 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 14.20 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 10 కోట్లు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 8.10 కోట్లు..కృష్ణా.. రూ. 8.50 కోట్లు.. గుంటూరు.. రూ. 10.20 కోట్లు.. నెల్లూరు.. రూ. 4.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవ్వాలంటే .. రూ. 124 కోట్లు రాబట్టాలి. మరి సంక్రాంతి భారీ పోటీలో ‘గేమ్ చేంజర్’ ఈ టార్గెట్ ను అందుకొని రామ్ చరణ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link