Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఒక అక్క కూడా ఉంది.. ఆమె గొప్పతనం ఏంటో తెలుసా..?
త్రేతాయుగంలో రాముడు అవతరించాడు. ఆయన చైత్రశుధ్ద నవమిరోజున కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు. ఆయనకు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సోదరులు. దశరథ మహారాజు సంతానం కోసంపుత్రకామేష్టి యజ్ఞం చేశారు. అప్పుడు ఆయనకు అగ్ని గుండం నుంచి దివ్యపురుషుడు ఆవిర్బవించి బంగారం పళ్లేంలో పాయసంను ఇచ్చారు.
ఆ పాయసంను దశరథుడు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్రా,కైకేయిలకు సమానంగా పంచాడు. ఆతర్వాత ఈ ముగ్గురు రాణులకు నలుగురు సంతానం కల్గుతారు. రామయ్యను సీతమ్మకు, లక్ష్మణుడుని ఉర్మిళకు, భరతుడిని మాండవికి, శత్రుఘ్నుడిని శృతకీర్తికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపిస్తారు.
ఇదిలా ఉండగా.. రాముడికి ఓక సోదరి కూడా ఉంది. ఆమె పేరు శాంత దేవీ. శాంతాదేవీ దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయకముందే పుట్టిందని చెబుతుంటారు. అయితే శాంతా దేవీ అంగవైకల్యం జన్మించింది. దీంతో దశరథుడు మంత్రుల సలహామేరకు ఆమెను అంగదేశ రాజు రోమాపాదుడికి దత్తత ఇచ్చేశాడంట.
రోమాపాదుడు శాంతాదేవికి సరైన వైద్యం చేయించి,ఆరోగ్యం కుదటపడేలా చేశాడంటే. దీంతో శాంత దేవీ ఆరోగ్యం కుదుటపడి, ఆమె ఎంతో సౌందర్యంగాను మారిపోయిందంట. అన్ని వేదాలు, ఉపనిషత్తులు, యుధ్ద రంగంలో కూడా ఆరితేరిందంట.
కొన్నిరోజులలకు శాంతాదేవీ రుష్యశృంగ మహర్షిని పెళ్లి చేసుకుందంట. ఆమె రాజ్యంలోకి రాకముందు ఆరాజ్యమంతా ఆకలితో, కరువులతో ప్రజలు బాధపడేవారంట. ఎప్పుడైతే శాంతా దేవీ ఆ రాజ్యంలో పట్టపు రాణిలా వచ్చిందో ఆతర్వాత ఎప్పుడు కూడా కరువు పరిస్థితులను ఆ రాజ్యం ఎదుర్కొలేదంట. తన భర్త రాజ్యం పూర్తిగా సుభిక్షంగా మారిపోయిందంట.
అందుకే అక్కడి ప్రజలు శాంతా దేవీని ఒక దేవతలా కొలుచుకుంటారు. ఇక శాంతాదేవీ ఆలయం కూడా మన దేశంలో ఉంది. హిమచల్ ప్రదేశ్ లోని కులు దగ్గర బంజారా ప్రాంతంలో రిష్య శృంగ ఆలయం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా శాంతాదేవీ విగ్రహం ఉందంట. ఇక్కడ శాంతాదేవీని ప్రత్యేకంగా పూజిస్తారంట.