Ram Recent Movies Total Box Office Collections:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..
డబుల్ ఇస్మార్ట్..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ టోటల్ గా రూ. 11.55 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.
స్కంధ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘స్కంధ’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 33.50 కోట్ల షేర్ రాబట్టి అబౌ యావరేజ్ గా నిలిచింది.
ది వారియర్.. రామ్ కథానాయకుడి యాక్ట్ చేసిన చిత్రం ‘ది వారియర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 21.65 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్ గా నిలిచింది.
రెడ్.. రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 19.86 కోట్ల షేర్ రాబట్టి హిట్ గా నిలిచింది.
ఇస్మార్ట్ శంకర్..
పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం అప్పట్లోనే రూ. 20.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ. 40.56 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.