Happy Birthday Silk Smitha: టాలీవుడ్ నటి సిల్క్ స్మిత.. ఆసక్తికర విషయాలు
దక్షిణాది సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటి సిల్క్ స్మిత 60వ పుట్టినరోజు (Silk Smitha Birth Anniversary) నేడు. సిల్క్ ఉంటే సినిమా హిట్టే అని కూడా ఆ రోజుల్లో అభిప్రాయం ఉండేది. హీరోలను మించిన పారితోషికం ఇచ్చినా నిర్మాతలు, దర్శకులకు ఇవ్వడానికి ఆమె వద్ద డేట్స్ ఖాళీగా ఉండేవి కావు. అలాంటి దివంగత నటి సిల్క్ స్మిత జయంతిని పురస్కరించుకుని సిల్క్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. అయితే ఓ సినిమాలో చేసిన సిల్క్ పాత్రకు గుర్తింపు రావడంతో ఆమెరు సిల్క్ స్మితగా మారిపోయింది. 1979లో విడుదలైన తమిళ సినిమా వండి చక్రం (బండి చక్రం)లో ఆమె పేరు సిల్క్.
డిసెంబరు 2, 1960న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది సిల్క్ స్మిత.
4వ తరగతి వరకు చదివింది. కొంత కాలం తర్వాత సినీనటి కావాలని, తెరపై వెలుగు వెలగాలన్న ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది విజయలక్ష్మి.
ప్రముఖ దక్షిణాది నటి అయిన సిల్క్ స్మిత తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించింది.
సిల్క్ స్మిత అంటే గుర్తుకొచ్చేవి ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్. అవి అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. సినిమాలో ఆమె ఉందంటే చాలు సినిమాకు క్యూ కట్టేవారు.
బావలు సయ్యా, మరదలు సయ్యా.. పాట అప్పట్లో టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. సిల్క్ స్మిత అంటేనే ఐటమ్ సాంగ్ అనే స్థాయికి చేరింది. కానీ వ్యక్తిగత జీవితం అంతగా కలిసిరాలేదు.
టాలీవుడ్ మూవీ ‘సీతాకోక చిలుక (1981)’ వంటి కొన్ని చిత్రాలలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘లయనం’ అనే సినిమా ఆమెకు చాలా పేరును తెచ్చింది
ఆలీబాబా అరడజను దొంగలు (1994) కుంతీ పుత్రుడు (1993) ఆదిత్య 369 (1991) - రాజనర్తకి నందినిగా గీతాంజలి (1989) ఖైదీ నెం. 786 (1988) పాతాళ భైరవి (1985) శ్రీదత్త దర్శనం (1985) మెరుపు దాడి (1984) ఖైదీ (1983) వసంత కోకిల (1982) యమకింకరుడు (1982) సీతాకోక చిలుక (1981) బావ బావమరిది
వ్యక్తిగత జీవితం ఏమాత్రం కలిసిరాలేదు. తనతో ఉన్నవాళ్లు ఆమె మంచి కోరుకుంటున్నారని చనువుగా మెలిగింది. కానీ ఆమెను ప్రేమించినట్లుగా నటించి సిల్క్ స్మిత డబ్బును కాజేసి మోసం చేసిన వాళ్లు ఉన్నారు. దీంతో మద్యపానం అలవాటయి మరో స్టేజ్‌లోకి వెళ్లిపోయిందని కథనాలు ఉన్నాయి.
సిల్క్ స్మిత 35వ ఏట కన్నుమూసింది. 1996, సెప్టెంబరు 23 న మద్రాసులోని తన నివాసంలో చనిపోయింది. ఆత్మహత్య చేసుకుందని చెబుతారు కానీ ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. (All Photos Credit: Twitter)
Photos: Pooja Bhalekar Photos: RGV హీరోయిన్ పూజా భలేకర్ ఫొటోస్ ట్రెండింగ్