Vijay - Rashmika: టెన్షన్లో పుష్పరాజ్.. ప్రియుడితో కలిసి వెకెషన్ ట్రిప్‌కు వెళ్లిన రష్మిక మందన్న.. పిక్స్ వైరల్..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప2 వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఈరోజు పోలీసులు తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.
అయితే.. ఉదయం నుంచి అల్లు అర్జున్ లీగల్ టీమ్ తో పాటు.. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో మరొవైపు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పుష్ప2 లో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నను కూడా ఇటీవల ఈ వివాదంలోకి లాగినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో రష్మిక మందన్న, తన ప్రియుడు విజయ్ దేవర కొండతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో కన్పించినట్లు తెలుస్తొంది.
వీరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. గీతగోవిందం, డియర్ కామ్రెడ్ మూవీ నుంచి విజయ్,రష్మికల మధ్య లవ్ నడుస్తొందని ఇంస్ట్రీలో టాక్ నడుస్తొంది. ఈ వార్తలను బలపర్చేలా.. ఇద్దరు కూడా జంటగా టూర్లకు వెళ్తుంటారు
ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్, పుష్ప2 మూవీని కూడా రష్మిక మందన్న.. విజయ్ దేవర కొండ ఫ్యామిలీతో కలసి చూసిన విషయం తెలిసిందే. వీరు మరోసారి ముంబై ఎయిర్ పోర్ట్ లో రచ్చ చేశారు.
అయితే.. ఒక వైపు అల్లు అర్జున్ పోలీసుల విచారణలో ఉండగా.. రష్మీక ఇలా.. ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అని కొంత మంది కామెంట్లు చేస్తున్నారంట. క్రిస్మస్,న్యూ ఇయర్ వేడుకల కోసం వీరిద్దరు ఫారీన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తొంది.