Rashmika Mandanna: రష్మిక మందన్న బీచ్ ఫోటోస్.. మరింత అందంగా
అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. నాగశౌర్య హీరోగా చేసిన ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత తెలుగులో వరస అవకాశాలు అందుకుంది.
ముఖ్యంగా రష్మిక విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమా తెలుగులో ఆమెకు బ్లాక్ బస్టర్ విజయం అందించింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
పుష్ప సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ రష్మికకు బాలీవుడ్ లో సైతం ఆఫర్లను తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే సందీప్ రెడ్డివంగా దర్శకత్వం లో వచ్చిన యానిమల్ సినిమా ఆమెకు మరో బ్లాక్ బస్టర్ విజయం అందించింది.
ఇక ఇదే క్రేజ్ తో సల్లూ భాయ్ తో నటించే ఛాన్స్ సైతం కొట్టేసింది ఈ హీరోయిన్. కాగా మరో పక్క సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటుంది.
తాజాగా బీచ్ లో అందాల విందు చేసింది ఈ నటి.. సముద్రపు ఒడ్డున బికినీలో మెరుస్తూ.. రష్మిక షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ హీరోయిన్ సముద్రపు సొరచేపలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు..ఆమె అభిమానులు.