Rashmika Mandanna: ఫ్రెండ్షిప్ విజయ్ దేవరకొండ తో.. పెళ్లికి మాత్రం ఆ హీరో కావాల్సిందే అంటున్న రష్మిక..!
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కన్నడ ఇండస్ట్రీలో కిర్రిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగుపెట్టి , ఆ తర్వాత తెలుగులో నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.
ఛలో సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండ నటించగా..వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఈ సినిమా తీసుకొచ్చిన ఇమేజ్ ఈమెకు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని అందించింది. అలా సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత పలు చిత్రాలలో నటించిన ఈమె తెలుగులో నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకొని, ఆ తర్వాత తమిళ్, హిందీలో కూడా అవకాశాలు అందుకుంది.
ప్రస్తుతం హిందీలో అలాగే తెలుగులో నటిస్తూ బిజీగా మారిన రష్మిక పై ఎప్పటికప్పుడు ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కన్నడ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పిన ఈమె.. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ గీతగోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండ తో పరిచయం ఏర్పడి, అతడితోనే ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి తోడు ఎక్కడ చూసినా రష్మిక.. విజయ్ దేవరకొండ తో కనిపిస్తూ ఉండడంతో ఈ రూమర్స్ కాస్త మరింత బలపడ్డాయని చెప్పవచ్చు. రష్మిక కూడా విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్ కి హాజరవుతూ ఉంటుంది. అయితే తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికకు ఒక ప్రశ్న ఎదురైంది. ఎవరిని ఫ్రెండ్ గా చూస్తారు.. ఎవరిని ప్రేమిస్తారు.. ఎవరిని పెళ్లి చేసుకుంటారు అంటూ విజయ్ దేవరకొండ, విజయ్ దళపతి, విజయ్ సేతుపతి పేర్లు వినిపించగా.. అందులో విజయ్ దేవరకొండ ఫ్రెండ్, విజయ్ సేతుపతి లవ్, విజయ్ దళపతి మ్యారీ అంటూ షాక్ ఇచ్చింది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ ను ఫ్రెండ్ గా ప్రకటించి, విజయ్ దళపతితో పెళ్లికి సిద్ధం అంటూ చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ పేరు మార్చినా విజయ్ అనే పేరును కామన్ గా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.