Rashmika Mandanna: గీతాంజలి కన్నా శ్రీవల్లినే మిన్న.. ఫిదా అవుతున్న రష్మిక అభిమానులు
పుష్ప మొదటి భాగంలో.. రష్మిక కొద్దిసేపు మాత్రమే కనిపించింది. అంతేకాదు ఆ చిత్రం వల్ల రష్మికకి పెద్దగా వచ్చిన పేరేమీ లేదు. అయితే ఆ చిత్రం వల్ల ఈ హీరోయిన్ కి ఏమన్నా లాభం జరిగింది అంటే.. హిందీలో కూడా ఈమెకు అవకాశం రావడమే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా పరంగా బాగా నోటీస్ అయ్యింది రష్మిక.
ఇక పుష్ప తర్వాత ఈ హీరోయిన్ యానిమల్ సినిమా అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో కనిపించి ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు వెంటనే పుష్ప చిత్రంలో మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించింది. అయితే పుష్ప రెండో భాగం.. కథ మొత్తం శ్రీవల్లి కోసమే నడవడం గమనర్హం. అంతేకాదు ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్ డైలాగ్స్ గా కూడా మంచిగా నటించింది రష్మిక.
ప్రస్తుతం శ్రీవల్లి పాత్రకి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక అభిమానులు.. తమకు యానిమల్ సినిమాలోని గీతాంజలి పాత్ర కన్నా.. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర ఎంతగానో నచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా ప్రస్తుతం రష్మిక వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. త్వరలోనే తానే ప్రధాన పాత్రలో రానున్న గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో కూడా కనిపించనుంది. ఇక ఈ సినిమా ఈ హీరోయిన్ కి ఎంత పేరు తీసుకొస్తుందో వేచి చూడాలి.