Rashmika Mandanna: ప్రెజెంట్ మన దేశంలో ఆ రికార్డు ఉన్న ఏకైక హీరోయిన్ రష్మిక..
రష్మిక మందన్న కన్నడ అమ్మాయి అయినా.. తెలుగు వాళ్లకు చాలా దగ్గర అయింది. ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది
రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్.
ప్రస్తుతం రష్మిక మందన్న "పుష్ప 2", ‘ది గర్ల్ ఫ్రెండ్’, సల్మాన్, మురుగదాస్ సినిమాల్లో నటిస్తోంది. రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.
తాజాగా అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో రష్మిక యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఇటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతోన్న 'స్పిరిట్' మూవీలో రష్మికనే హీరోయిన్ గా దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.
అటు ఆంగ్ల సాహిత్యం, జర్నలిజంలో కూడా బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు దక్కించుకుంది.
రష్మిక మందన్న తల్లిదండ్రులు వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటారు. ఈమెకో చిట్టి చెల్లెలు కూడా ఉంది. ఈమె వీలునపుడల్లా తన కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది.