Mrunal Thakur: ప్రభాస్ సినిమాని అందుకే వదులుకున్న మృనాల్.. కారణమేమిటంటే..?
ప్రముఖ బెంగాలీ బ్యూటీ మృనాల్ ఠాకూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్లో అడుగుపెట్టిన కొత్తలో పలు సీరియల్స్ లో నటించిన ఈమె..ఆ తర్వాత చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో.. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో నటించిన చిత్రం.. సీతారామం. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తెలుగులో హాయ్ నాన్న , ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో అలరించిన ఈమె ఇప్పుడు హిందీతో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. అంతేకాదు తాజాగా ఒక భారీ ఆఫర్.. కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేమిటంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో ఈమె అవకాశం దక్కించుకుందని, గత కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన మృనాల్ అసలు విషయంపై.. కామెంట్లు చేసింది. అంతే కాదు క్షమించండి అంటూ ప్రభాస్ అభిమానులను కోరుతోంది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక అందమైన ప్రేమ కథ నేపథ్యంలో రాబోతున్నట్లు సమాచారం. ఇందులో మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇటీవల ప్రభాస్ తో మృణాల్ ఉన్న ఫోటోని కూడా ఒక నెటిజన్లు..షేర్ చేస్తూ ఇది హను రాఘవపూడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
దీంతో మృణాల్ రియాక్ట్ అవుతూ మీ ఊహాగానాలకు పుల్ స్టాప్.. పెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఇందులో నేను నటించడం లేదు అంటూ తెలిపింది. మొత్తానికి అయితే ప్రభాస్ సినిమాలో మృనాల్ నటించబోతోంది అంటూ.. వస్తున్న వార్తలకు చెక్ పడింది. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న రూమర్స్ ప్రకారం.. ఈ చిత్రంలో ముందుగా మృనాల్ నుంచి అనుకున్నారట. కానీ మృనాల్ క్యారెక్టర్ ఈచిత్రం లో..సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుంది అంట.
ఇంతకుముందు హను రాఘవపూడి.. చేసిన సీతారామం మృనాల్ కి.. ఎంత పేరు తెచ్చిందో మనకు తెలిసిన విషయమే. మళ్లీ అదే దర్శకుడితో..తాను సెకండ్ హీరోయిన్ గా చేస్తే అది తన ఇమేజ్ పైన ప్రభావం చూపొచ్చు అని సుటిమెట్టగా తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక అందుకే ఈ సినిమాలోకి సరికొత్త హీరోయిన్ ఇమాన్వి అడుగుపెట్టింది. మరి ఈ హీరోయిన్ ఒప్పుకున్న పాత్ర..మృనాల్ కి.. ఇచ్చిందేనా లేదా వేరేదా అనేది తెలియాల్సి ఉంది.