Redmi K80 Series: డబ్బు రెడీ చేసుకోండి.. చీప్ ధరలోనే 6500mAh బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ Redmi K80 మొబైల్ రాబోతోంది!
ఇటీవలే Redmi K80 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని కంపెనీ నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ జంబో బ్యాటరీ సెటప్‌తో తీసుకు రానుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Redmi K80 స్మార్ట్‌ఫోన్ కంపెనీ వనిల్లా వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా సిరీస్‌లో ప్రో మోడల్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వాటర్ ఫ్రూఫ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
ఈ Redmi K80 సిరీస్ అద్భుతమైన టెలిఫోటో కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది మెరుగైన జూమ్ సామర్థ్యాన్ని అందిస్తున్నట్లు టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు. అలాగే ఫోటోస్ పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
రెడ్ మీ కంపెనీ గతంలో విడుదల చేసిన Redmi K70తో పాటు Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్స్‌కి ఎలాంటి వాటర్‌ప్రూఫ్ సామర్థ్యాలను అందించకపోయి.. ఈ వేరియంట్‌లో మాత్రం తీసుకు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది IP68 లేదా IP69 రేటింగ్ సామర్థ్యంలో వస్తోంది.
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలో మాక్రో షాట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా చిన్న సబ్జెక్ట్‌ను కూడా సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. అలాగే కెమెరాలో ఇవే కాకుండా అనేక ఆప్డేట్‌లను అందిస్తోంది.
ఇక Redmi K80 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 6500mAh జంబో సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా త్వరలోనే లాంచ్ కాబోయే Redmi Note 14 Pro+ మొబైల్ కూడా శక్తివంతమైన 6200mAh సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2K OLED ప్యానెల్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు. ఇంకా ఈ సిరీస్‌కి సంబంధించిన ధరలను కంపెనీ వెల్లడించలేదు.