Jio Cheapest plan: జియో అదిరిపోయే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ పై ఓ లుక్కేశారా? రూ. 479.. 84 రోజుల వ్యాలిడిటీ..

Tue, 30 Jul 2024-11:28 am,

Reliance Jio Cheapet Plans: రిలయన్స్‌ జియో అతితక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్‌ మీ ముందుకు తీసుకువచ్చింది. దీని వ్యాలిడిటీ 84 రోజుల వరకు వర్తిస్తుంది. మీరు కూడా జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఎక్కువ రోజుల ప్లాన్‌ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్‌ ప్లాన్‌. ఆ వివరాలు తెలుసుకుందాం.  

జియో రూ. 479 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. పెరిగిన టెలికాం ధరల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇదో అద్భుత అవకాశం. ఇంతకు ముందు ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ధర రూ. 395 ఉండేది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ ధర రూ. 479 అయింది. మీరు కూడా జియో ప్రీపెయిడ్‌ కస్టమర్లు అయితే, ఈ మూడు నెలల ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే మీకు ప్రతిరోజూ కేవలం రూ. 6 వర్తిస్తుంది.  

ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో కేవలం కాలింగ్‌ కోసం వినయోగిస్తున్న వినియోగదారులు ఈ రీఛార్జీ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌లో మీకు 6జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ సౌకర్యంతోపాటు 1000 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కూడా ఉంటుంది.   

జియో రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయంతోపాటు అపరిమిత కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ ల సౌకర్యం కూడా పొందుతారు. ఇందులో మీకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌ కూడా లభిస్తుంది. అంతేకాదు ఇందులో మీకు 5G సర్వీస్‌ ప్లాన్‌  అందిస్తుంది.   

జియో 84 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్‌ ప్లాన్స్‌పై నాలుగు ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 395 గతంలో ఉన్న రీఛార్జ్‌ ప్లాన్ ఇప్పుడు రూ. 479 అయింది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. అదేవిధంగా రూ. 799 ప్లాన్‌తో ప్రతిరోజు 1.5 జీబీ డేటా, రూ. 859 ప్రతిరోజూ 2జీబీ డేటా, రూ. 1199 తో రీఛార్జ్‌ చేస్తే 3 జీబీ డేటా ప్రతిరోజు అపరిమిత కాలింగ్‌ ఇతర సౌకర్యాలు కూడా 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link