Republic Day Special: సైన్యంలో చేరిన టీమిండియా క్రికెట్ ప్లేయర్లు వీళ్లే..
టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోని చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాల అనుకున్నాడు. తరచుగా తన ఖాళీ సమయంలో భారత సైన్యంలోని యువతతో గడుపుతాడు. 2015 సంవత్సరంలో ధోని భారత ఆర్మీకి లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమితుడయ్యాడు.
భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఆర్మీలో ఉన్నారు. కపిల్ దేవ్‌కు 2008లో భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఇది కాకుండా 2019లో కపిల్ దేవ్ హర్యానా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఛాన్స్‌లర్‌గా కూడా నియమితులయ్యారు.
ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు. సచిన్ టెండూల్కర్ 2010 సంవత్సరంలో భారత వైమానిక దళానికి గ్రూప్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.
టీమిండియా అత్యంత విజయవంతమైన స్పిన్ బౌలర్లలో ఒకరైన హర్భజన్ సింగ్ ఒకరు. తన అద్భుతమైన ఆట కారణంగా పంజాబ్ పోలీస్‌లో డీఎస్పీ కూడా అయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు.
2007లో టీ20 వరల్డ్‌కప్‌ను టీమింండియా గెలుచుకుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై చివరి ఓవర్ వేసిన భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు జోగిందర్ శర్మ. అయితే ఆ తరువాత ఎక్కువ కాలం జట్టులో కొనసాగలేకపోయాడు. ప్రస్తుతం జోగిందర్ హర్యానా పోలీస్‌లో డీసీపీగా పనిచేస్తున్నారు.