Chicken Handi: రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!
చికెన్- కేజీ, టమోటా-పావు కేజీ, ఉల్లిపాయలు-3, కరివేపాకు, నూనె, నెయ్యి, ఉప్పు- రుచికి సరిపడా, కసూరీ మేతీ-ఒక స్పూన్, ధనియాలు, కారం- 2 టీస్పూన్, పసుపు-1 టీస్పూన్, జిలకర్ర పొడి- ఒక్కో స్పూన్, పెరుగు- మూడు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు-2 టేబుల్ స్పూన్
ముందకు చికెన్ బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చెయ్యాలి. ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేస్తే రంగు బాగా కనిపిస్తుంది.
ఆ తర్వాత మాములు కారం, టమోటా ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు టమోటాలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చికెన్ ముక్కలు వేసి మరోసారి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు మూత తీసి పెరుగు మీకు కావాలంటే నీళ్లు కూడా ఎక్కువ పోసుకోవచ్చు. మూత పెట్టి చికెన్ ఉడికేవరకు మగ్గించాలి. ఆ తర్వాత మూత తీసి కసూరీ మేతి, క్రీమ్, ధనియాలు, జిలకర్ర పొడి పై నుంచి వేసుకోవాలి. అంతే రుచికరమైన హండీ చికెన్ రెడీ.
దీన్ని అన్నం లేదా చపాతీల్లోకి తింటే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మీరు కడాయి చికెన్ తయారు చేస్తున్నారు కాబట్టి గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లేదా మసాలా వద్దు అనుకుంటే అలానే తినేయొచ్చు కూడా.