Ritu Varma: బ్లూ డ్రెస్సులు రీతు వర్మ.. వారేవా అంటున్న అభిమానులు
రీతు వర్మ అనుకోకుండా అనే షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు తెచ్చుకునింది. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటేషన్ లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది.
ఈ షార్ట్ ఫిలిం లో నటనకు రీతు వర్మ ఉత్తమ నటిగానూ అవార్డు కూడా సంపాదించుకుంది. ఈ షార్ట్ ఫిలిం 2013లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ లో ప్రదర్శితమై రీతు వర్మకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
అయితే విజయ్ దేవరకొండతో చేసిన పెళ్లి చూపులు చిత్రం ఈమెను సార్ హీరోయిన్ గా మార్చింది. చిత్ర పాత్రలో కనిపించి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ నటి.
ఆ తరువాత తెలుగులో ఎన్నో అవకాశాలు అందుకుంటూ మంచి పాత్రలలో కనిపిస్తూ మెప్పించసాగింది. ఈ మధ్యనే విశాల్ హీరోగా చేసిన మార్క్ ఆంటోనీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ మెప్పిస్తున్నాయి. బ్లూ డ్రెస్సులు ఎంతో అందంగా కనిపిస్తూ అందరినీ మైమరిపిస్తుంది రీతు వర్మ.