First Night Video: ఛీ..ఛీ..పెళ్లికి ముందే శోభనం వీడియో షూట్.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫస్ట్ నైట్ వీడియో..
పూర్వకాలంలో పెళ్లిని ఒక పండగల చేసేవారు.. ఎవరింట్లో జరిగిన ఈ పెళ్లిని అందరూ సీతారాముల కళ్యాణంగా భావించేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.
పాశ్యాత్య సంస్కృతి అనే వ్యాధి సోకడంతో భారత సాంస్కృతికి బై బై చెబుతున్నారు. పెళ్లికి ముందే చాలామంది శారీరకంగా కలుస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ అంటూ పెళ్లి అర్ధాన్నే చెడగొడుతున్నారు.
నిజానికి 2017వ సంవత్సరం నుంచి ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ సాంస్కృతి పెరుగుకుంటూ వస్తోంది. మనం ఇప్పటికీ చాలామందిని ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని పొలాలు, డేంజరస్ ప్లేసుల్లో కూడా తిరుగుతూ ప్రమాదాల గురైన వారిని చూశాం.
కొంతమంది అయితే క్రియేటివిటీ కోసం బురదలో దొర్లడం, చెట్లను పట్టుకుని ఊగడం వంటివి కూడా ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లో భాగంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా పాతదైపోయింది.
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా పాతదైపోయింది. ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. కొంతమంది పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కి సంబంధించిన ఫ్రీ ఫస్ట్ నైట్ వీడియోలను షూట్ చేయించుకుంటున్నారు.
తాజాగా ఇటీవలే ఓ జంట పెళ్లికి ముందే ప్రీ ఫస్ట్ నైట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చూసిన వారంతా ఇదేం వింత రా బాబు అంటున్నారు.
పెళ్లి తర్వాత జరిగే అపురూపమైన కార్యక్రమాల్లో శోభనం ఒకటి.. హిందూ పురాణాల ప్రకారం శోభనానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఇది.. ఆధునిక సాంస్కృతి కారణంగా అందరి మధ్యలో జరుగుతోంది.
ఒక జంట వినూత్నంగా ఆలోచించి తమ శోభనానికి సంబంధించిన వీడియోను పెళ్లికి ముందే షూట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సాంప్రదాయ దుస్తుల్లో గదిలోకి వెళ్లడం మీరు గమనించవచ్చు.
కొత్త ట్రెండ్..: ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్.. pic.twitter.com/sFANzr9T0k
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) July 28, 2024
అలాగే ఈ వీడియోలో ఫ్రీ ఫస్ట్ నైట్ కోసం ప్రత్యేకమైన గదిని పూలతో అలంకరించిన దృశ్యాలు కూడా మీకు కనిపిస్తాయి.
అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదేం కర్మ రా బాబు అని ఫీల్ అవుతున్నారు.. కొంతమంది నెటిజన్స్ అయితే ఇదేం దరిద్రం అంటూ ఫైర్ అవుతున్నారు.