Rule Changes in October: ప్రజలకు ముఖ్యగమనిక.. అక్టోబర్ 1వ తేదీ నుంచి మారునున్న రూల్స్ ఇవే..!
అక్టోబర్ 1వ తేదీ నుంచి రెండు వేల రూపాయల నోటు చెలామణి ఆగిపోనుంది. మీ వద్ద ఇంకా రూ.2 వేల నోటు ఉంటే.. సెప్టెంబర్ 30లోపు బ్యాంకులో మార్చుకోవాలి. అక్టోబర్ 1 నుంచి రూ.2000 నోటు ఉంటే మార్చుకునే అవకాశం ఉండదు.
ఎల్‌పీజీతోపాటు CNG-PNG ధరలను ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు మారుస్తాయి. ఈసారి కూడా CNG-PNGతో పాటు ATF ధరలు కూడా మారే అవకాశం ఉంది.
విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అక్టోబర్ 1 నుంచి విదేశీ ప్రయాణం మరింత ఖరీదు కానుంది. రూ.7 లక్షల వరకు టూర్ ప్యాకేజీలపై 5 శాతం TCX చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రూ.7 లక్షలకు పైబడిన టూర్ ప్యాకేజీలకు 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 30వ తేదీలోపు పీపీఎఫ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలకు ఆధార్‌తో లింక్ చేయాలి. లేకపోతే అక్టోబర్ 1వ నుంచి మీ అకౌంట్ స్తంభింపజేయవచ్చు. అంటే మీరు మీ ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు లేదా పెట్టుబడి పెట్టేందుకు వీలుండదు.
అక్టోబర్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పండగలు ఆధారంగా సెలవులు మారుతుంటాయి. బ్యాంక్ సెలవులను ముందుగానే చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి.