Samantha: చైతూ అలవాటే విడాకులకు దారితీసిందా.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..!

Thu, 14 Nov 2024-3:45 pm,

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఏమాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన సమంత,  అనతి కాలంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు దక్కించుకుంది.  మరొకవైపు అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య కూడా తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. 

ఇక వీరిద్దరూ తొలి సినిమాలో నటించినప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్ల పాటు పెళ్లి కోసం ఎదురుచూసిన ఈ జంట, పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంది. 

అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం మాత్రం ఎవరికీ తెలియలేదు. ఇప్పటికే ఎన్నో పుకార్లు వినిపించినా అవన్నీ కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఈ జంట.. విడిపోవడానికి కారణం నాగచైతన్య అలవాటే అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. 

అసలు విషయంలోకి వెళితే.. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య.. ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ ఆయన ఖాతాలో ఒకటి కూడా లేదని చెప్పవచ్చు. అలాగే వైవాహిక జీవితంలో.. కూడా ఆయన హ్యాండిల్ చేసుకోలేకపోయారు. అలా వ్యక్తిగతంగా,  వృత్తిపరంగా రెండింటిలో కూడా తడబడ్డారు నాగచైతన్య. 

ఇకపోతే నాగచైతన్య చాలా సైలెంట్ గా ఉంటారు. తన బాధను ఎవరితోనూ పంచుకోరు. మనసులోనే పెట్టుకుంటారు. తాగినప్పుడు మాత్రం ఒంటరిగా కూర్చుని తన బాధను బయటపెడతారు. ఇలా చేయడం సమంతాకు నచ్చలేదట.   

నీ మనసులో ఏదైతే ఉందో ఎవరితోనైనా పంచుకో..ఆ అలవాటు మానుకోవాలి అంటూ ఎన్నోసార్లు నచ్చచెప్పిందట. కానీ నాగచైతన్య అలవాటును మార్చుకోకపోవడం వల్లే సమంత విసిగిపోయి అతడికి దూరమైందని సమాచారం. ఇక ప్రస్తుతం నాగచైతన్య శోభితాను పెళ్లి చేసుకోబోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link