Saddest City in World: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం.. జనాల ఆయుష్షు కూడా తక్కువే.. రక్తంలా ప్రవాహించే నది

Tue, 21 Mar 2023-3:16 am,

Saddest City in World, Norilsk: జీవితంలో ఎవరైనా వీలైనంత ఆనందంగా ఉంటూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. కానీ సంతోషం అంటే ఏంటో తెలియకుండానే బతుకుతూ సగం జీవితానికే ఫుల్‌స్టాప్ పెడుతున్న నగరం ఒకటుంది అంటే నమ్మశక్యం కావడం లేదు కదా. 

Saddest City in World, Norilsk: రష్యాలోని నోరిల్స్క్ పర్వతాల మధ్య ఉన్న నగరం పేరే నోరిల్క్స్. ఈ సిటీ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ నగరానికి ప్రపంచంలోనే 'మోస్ట్ డిప్రెసింగ్ సిటీ' అని పేరు ఉంది. 

Saddest City in World, Norilsk: రష్యాలో ఉత్తరాన ఉన్న నోరిల్స్క్ నగరవాసులు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితి అలాంటిది ఇలాంటిది కాదు. ఆ నగరంలో రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడమే కాదు.. ఆ నగరం ఎన్నో అసౌకర్యాలకు నిలయం.

Saddest City in World, Norilsk: నగరానికి వెళ్లాలనుకున్నా.. నగరం నుంచి బయటికి వెళ్లాలనుకున్నా.. కేవలం సరుకు రవాణాకు ఉపయోగించే ఒక మార్గం మాత్రమే వీరికి ఆధారం. ఎయిర్ పోర్ట్ కనెక్టివిటి కూడా ఉన్నప్పటికీ.. అక్కడికి వెళ్లాలంటే ధైర్యం చేసే వారు చాలా అంటే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.

Saddest City in World, Norilsk: కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, నగరంలో సుమారు 170,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. నోరిల్స్క్‌లోని చాలా మంది వ్యక్తుల మధ్యస్థ నెలవారీ ఆదాయం  $986 అమెరికన్ డాలర్లు. రష్యన్‌ల సగటు నెలవారీ ఆదాయం $739 కంటే ఇది చాలా ఎక్కువ.

Saddest City in World, Norilsk: ఈ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద ఖనిజ నిక్షేపాలైన నికెల్-కాపర్-పల్లాడియం గనులకు అతి సమీపంలో ఉంది. ఈ ఖనిజాల వెలికితీతే ఈ నగరవాసులకు ప్రధాన ఆదాయవనరు. నగరంలో చాలా మంది ప్రజలు నోరిల్స్క్ నికెల్ కోసం పనిచేస్తున్నారు.

Saddest City in World, Norilsk: ఇక్కడి గనుల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా, నోరిల్స్క్‌లో ప్రవహించే నదిలోని నీటి రంగు కూడా పూర్తి ఎరుపు రంగులోకి మారింది. పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్లే ఈ నది నీటి ప్రవాహం ఎరుపు రంగులోకి మారింది.

Saddest City in World, Norilsk: నికెల్ ప్లాంట్ నుంచి 20 లక్షల టన్నులకు పైగా విష వాయువులు విడుదలవుతున్నాయి అని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా రసాయనిక వర్షాలు కురవడం, నీరు కలుషితం అవడం జరుగుతోంది. ఫలితంగా చిన్న వయస్సులోనే అక్కడి ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. నోరిల్స్క్‌లో ఒక వ్యక్తి సగటు ఆయుష్షు 59 ఏళ్లు మాత్రమే. ఇది అక్కడి జాతీయ సగటు 69 సంవత్సరాలు కంటే పదేళ్లు తక్కువే. అంటే నిండు నూరేళ్లు అనే మాట అక్కడ అసలు వినిపించనే వినిపించదన్నమట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link