Saddula Bathukamma 2024: సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా? ఈరోజు ప్రసాదం ఎంతో విశేషం..
అక్టోబర్ 2వ తేదీ పెత్తర అమావాస్యకు మొదలైంది. ఇది అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. రేపు అంటే అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నారు. ఈరోజు మలీద ముద్దాలతో ప్రసాదం తయారు చేస్తారు.
9 రోజులపాటు వైభవంగా నిర్వహించే ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేప కాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు.
చివరి రోజున సద్దుల బతుకమ్మను తయారు చేస్తారు. ఊరూవాడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పసుపు గౌరమ్మని తయారు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు తయారు చేస్తారు. అందరూ వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.
సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీకగా ఈ వేడుకలు జరుపుకుంటారు. పిల్లాజెల్లాలు అంతా కలిసి పట్టుచీరలు, నగలు ధరించి అందరూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఉదయం రంగరంగుల పూలు తెచ్చుకుని బతుకమ్మను పేరుస్తారు.
ఈరోజు బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీన్ని పెద్దబతుకమ్మ అని కూడా పిలుస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)