Sai Pallavi: హవ్వా.. పెళ్లై పిల్లలున్న హీరోతో సాయి పల్లవి డేటింగ్.. ? అతి రహస్యం బట్ట బయలు..
సాయి పల్లవి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేర్లలో ఆమె ఒకరు.సినిమా ఇండస్ట్రీ అంటేనే అందాల ప్రపంచం. ఇందులో అలాంటి ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతుంది.
అంతేకాదు సాయి పల్లవి మొదటి నుంచి విభిన్న కథా చిత్రాలతో తన కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’ మూవీతో పరిచయమైంది. తెలుగులో ఈమె తొలి చిత్రం ‘ఫిదా’.
అక్కడ నుంచి ఈమె యాక్ట్ చేసే ప్రతి సినిమాలో హీరో ఎవరున్నా.. కథానాయికగా సాయి పల్లవి డామినేషన్ మాత్రం కనిపిస్తోంది. ఫిదాలో ఆత్మాభిమానం ఉన్న యువతి పాత్రలో నటిస్తే.. విరాట పర్వంలో ఒక నక్సలైట్ ను ప్రేమించే యువతి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచింది.
సాయి పల్లవి డ్యాన్స్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సాయి పల్లవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సాయి పల్లవి మామూలు పాత్రలకు దూరంగా ఉంటుంది.
తాజాగా సాయి పల్లవికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఈమె పెళ్లై పిల్లలున్న ఓ హీరోతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఆమె అభిమానులకు షాక్ కి గురి చేసింది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది రూమరా.. ? లేకపోతే నిజంగానే ఈమె పెళ్లైన ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తుందా అనేది తెలియాలి.
సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ మూవీలో కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ‘రామాయణం’ మూవీలో సీత పాత్రలో నటిస్తోంది.