Sai Pallavi: రామ్ చరణ్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. అసలేమైందంటే..?

Mon, 25 Nov 2024-8:05 pm,

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ సినిమా తర్వాత ఈయన సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాను అధికారికంగా ప్రకటించారు.. అయితే ఇందులో సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకోవాలని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో  హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అందుకే ఈ పాత్రకు సాయి పల్లవి అయితే సెట్ అవుతుందని సుకుమార్ అనుకున్నారట. 

ఇకపోతే ఇప్పటికే సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప -2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సినిమా హడావిడి పూర్తవగానే రామ్ చరణ్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా అనుకోగా.. అయితే ఆమె వరుస సినిమాల కారణంగా డేట్స్ కేటాయించలేకపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అసలు విషయంలోకి వెళితే, అమరన్ సినిమాతో మంచి జోష్ మీద ఉన్న ఈమె ఇప్పుడు నాగచైతన్యతో తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అలాగే బాలీవుడ్లో రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది.   

హిస్టారికల్ మూవీ విడుదల అవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఇటు రెండు సినిమాలు ఒకేసారి ఒప్పుకుంటే ఏ పాత్రకి న్యాయం చేయలేను అనే ఆలోచనతోనే రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నిన్నటి వరకు సాయి పల్లవి నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి .మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link