Prabhas సలార్ మూవీ గ్రాండ్ లాంచింగ్.. ప్రత్యేక అతిథిగా యశ్

Fri, 15 Jan 2021-1:56 pm,

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేడు సలార్ సినిమా లాంచ్ అయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు ప్రభాస్(Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. (All Photos: Twitter)

ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) ఇటీవలే ప్రకటించిన సలార్ మూవీ(Salaar Movie) షూటింగ్ ఈ నెల చివర్లో ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందుగా కనుమ పర్వదినం సందర్భంగా జనవరి 15న సలార్ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసింది మూవీ యూనిట్.  

Gallery: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

సలార్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుండటంతో హీరోయిన్ సైతం ప్యాన్ ఇండియా ఫేస్ అయ్యుంటే బాగుంటుందనే ఉద్దేశంతో సాహో సినిమా తరహాలోనే బాలీవుడ్ బ్యూటీ పేర్లనే పరిశీలిస్తున్నారు.

 కేజీఎఫ్ సీక్వెల్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన నటించబోయే హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. 

Gallery: Actress Aathmika Photos: అందాల నటి ఆత్మిక లేటెస్ట్ ఫొటోస్

మరోవైపు ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే గతానికి భిన్నంగా వరుసగా సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంటూ తన అభిమానును ఆశ్చర్యానికి లోను చేస్తున్నాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link